హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన

కోనసీమ: కొత్తపేటలోని ప్రియదర్శిని బాలవిహార్‌లో అగ్నిమాపక శాఖ కొత్తపేట ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ హెడ్ కానిస్టేబుళ్లు మహేష్ శంకర్, ఎస్.కె. సంధాని, కానిస్టేబుల్ కెవిపి ప్రసాద్ అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు.