హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ వర్గాల మధ్య వివాదం

NLR: కలువాయి పంచాయతీ నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 2వ వార్డు అభ్యర్థి రమేశ్‌బాబు నామినేషన్ పత్రాలను చించివేసినట్లు, 7వ వార్డు అభ్యర్థి మల్లికార్జున్‌ను బయటకు లాగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి.