BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులో ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు జరగనున్న శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి జాతరకు భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని SP సంకీర్త్ ఆదేశించారు. శుక్రవారం జాతర ప్రాంగణాన్ని పరిశీలించి ట్రాఫిక్, పార్కింగ్, భక్తుల రద్దీ నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
బుగులోని జాతరకు పటిష్ఠ బందోబస్తు: SP


