హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరువర్గాల మధ్య ఘర్షణ మహిళల కళ్లల్లో కారం

ప్రకాశం: కొమరోలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి బుజ్జమ్మ నామినేషన్ పత్రాలను టీడీపీ వర్గీయులు చించివేశారు. నామినేషన్‌కు వెళ్తున్న వైసీపీ నాయకులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మహిళలు కళ్లల్లో కారం చల్లుకుని దాడులకు దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.