హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలసదనంలో కలెక్టర్ స్నేహ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనంలో ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, సహపంక్తి భోజనం చేశారు. బాలలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.