హైదరాబాద్: 28°C
వార్తలు

స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్ విడుదల

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బర్డ్‌ఫ్లూ వ్యాక్సిన్ విడుదలైంది. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్.. భోపాల్‌లో విడుదల చేసి జాతికి అంకితం చేశారు. దీంతో కోళ్లకు ప్రాణాంతక వైరస్ నుంచి రక్షణ లభించడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా దక్కనుంది. పక్షుల నుంచి మనుషులకు బర్డ్‌ఫ్లూ వ్యాపించే ప్రమాదాన్ని తగ్గించడంలోనూ, వెటర్నరీ వ్యాక్సిన్ల తయారీలో భారత్ స్వావలంబన సాధించడంలోనూ ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.