హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్తిక దీపం' విషయంలో సుప్రీం మినహాయింపు

తమిళనాడు తిరుప్పరకుండ్రం కొండపై 'కార్తిక దీపం' వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అయితే, నవంబర్ 24న ఒక్కరోజు దీపం వెలిగించేందుకు అనుమతించింది. దేవస్థానం ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే దీపం వెలిగించాలని తెలిపింది. కాగా, దీపం వెలిగించే స్థలంపై హిందూ సంస్థలు, దర్గా యాజమాన్యం, ప్రభుత్వానికి మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది.