ఢిల్లీలో జరగనున్న ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌కు రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలని ధ్వజమెత్తాయి. కాగా, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత సమయంలో 'మా నీళ్లను ముట్టుకుంటే చేతులు నరికేస్తాం' అంటూ ముసాదిక్ మాలిక్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
వార్తలు
భారత్‌కు పాక్ మంత్రి.. కేంద్రంపై విపక్షాల ఫైర్


