హైదరాబాద్: 28°C
వార్తలు

147.66 కోట్లకు చేరిన భారత జనాభా

భారత్‌ జనాభా 147.66 కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) నివేదిక వెల్లడించింది. మరో 40 ఏళ్లలో జనాభా 170 కోట్లకు చేరి, ఆ తర్వాత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. దేశ జనాభాలో 26 శాతం మంది 10-24 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపింది. 15-64 ఏళ్ల వయసు వారు 69 శాతంగా ఉన్నారని పేర్కొంది. భారతీయుల సగటు ఆయుర్దాయం పురుషుల్లో 71, మహిళల్లో 74 ఏళ్లుగా ఉన్నట్లు వెల్లడించింది.