హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో షాక్

కావేరీ జలాల వివాదంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కావేరీ జలాల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో నీటి విడుదలపై తమిళనాడు చేసిన విజ్ఞప్తులకు కోర్టులో ఊరట లభించలేదు.