TG: రైతుల బాధలు పట్టించుకోకుండా CM రేవంత్ చిల్లర మాటలతో చిందులు తొక్కుతున్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. కరువులు, కన్నీళ్లతో ప్రజలు అల్లాడుతుంటే నీళ్ల దోపిడీపై మౌనం వహిస్తూ, నిజాలు చెప్పేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహి అమరుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. KCR ఉద్యమ శిఖరం, కల్పవృక్షమన్నారు. నువ్వొక కలుపు మొక్కవని సీఎం రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్తలు
KCR కల్పవృక్షం.. నువ్వు కలుపుమొక్కవి: KTR


