హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.25 వేల రుణం.. 30 ఏళ్ల వివాదం

కేవలం రూ.25 వేల అప్పు.. ఓ మహిళను 30 ఏళ్ల పాటు ఇబ్బందులకు గురిచేసింది. మహారాష్ట్రకు చెందిన ముండుబాయి దావ్రే 1995లో కుమార్తె పెళ్లి కోసం తీసుకున్న రుణానికి తన నాలుగున్నర ఎకరాల భూమిని తనఖా పెట్టింది. అప్పు చెల్లించేందుకు వెళ్లగా వడ్డీ వ్యాపారీ రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. నకిలీ పత్రాలతో భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. దీంతో జిల్లా అధికారులను ఆశ్రయించగా, విచారణ జరిపిన అధికారులు ఆమె భూమిని తిరిగి అప్పగించారు.