హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియా పేసర్ల అరుదైన రికార్డు

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ మొత్తం పది వికెట్లనూ ఫాస్ట్ బౌలర్లే పడగొట్టడం విశేషం. బుమ్రా 4, ఆకాశ్ దీప్ 3, అన్షుల్ కాంబోజ్ 2, ప్రసిధ్ కృష్ణ ఒక వికెట్ తీశారు. న్యూజిలాండ్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు అన్ని వికెట్లు తీయడం 2014 తర్వాత ఇదే రెండోసారి.