హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్ చేతిలో లంక చిత్తు.. 29 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు

రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో SLను చిత్తు చేసి సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 98 పరుగులకే కుప్పకూలిన లంక, రెండో ఇన్నింగ్స్‌లో 316 పరుగులు చేసి 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. PAK13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో SL1997 తర్వాత తొలిసారి ఒక్క టెస్టు విజయం కూడా లేకుండానే ఏడాదిని ముగించింది.