హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తే క్రిమినల్ కేసులు : సీఐ

KDP: ముద్దనూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించినా, ప్రత్యర్థులను బెదిరించే ప్రయత్నం చేసినా ఉపేక్షించేది లేదని సీఐ నగేష్ బాబు స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.