హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు పదవీ గండం

GDWL: కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంటూ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. 81 మందితో ప్రకటించిన నూతన కార్యదర్శుల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఇసుక మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.