హైదరాబాద్: 28°C
తెలంగాణ

విభేదాలతో నిలిచిన గ్రామాభివృద్ధి పనులు

NLG: కట్టంగూరు గ్రామపంచాయతీలో సర్పంచ్ ముక్కాముల శ్యామల, ఉప సర్పంచ్ గుండు రాంబాబు మధ్య విభేదాల కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలో లక్షలాది రూపాయల నిధులున్నా పనులు చేపట్టడం లేదని, తాగునీటి సమస్యతో పాటు సీసీ రోడ్లు లేక పలు వార్డుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.