NLR: సోమశిల జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో నెల్లూరు జిల్లాలో నీటి వినియోగంపై అధికారులు అప్రమత్తం చేశారు. 78 టీఎంసీల పూర్తి సామర్థ్యం కలిగిన జలాశయంలో ప్రస్తుతం 19.687 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో సోమశిల నుంచి దిగువకు నీటి విడుదల చేసే అవకాశాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సోమశిల నుంచి నీటి విడుదల లేనట్టే!


