KDP: అంకాలమ్మగూడూరు సమీపంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడిని వైసీపీ మైదుకూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు భూమిరెడ్డి బాలకృష్ణారెడ్డి ఖండించారు. దాడులతో ప్రజాస్వామ్య పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. కూటమి నిరంకుశ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై నిష్పక్షపాత విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి హేయం: బాలకృష్ణారెడ్డి


