తిరుపతి జిల్లా తొట్టంబేడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీపీ పదవి కోసం టీడీపీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తమకు ఎంపీపీ పదవి ఇవ్వాలంటూ బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు భారీగా ఎంపీడీవో ఆఫీస్‌లోకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
తొట్టంబేడులో ఉద్రిక్తత


