హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోటలో 'ఎల్లమ్మ' షూటింగ్ సందడి

KDP: పర్యాటక ప్రాంతమైన గండికోటలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. దర్శకుడు వేణు ఆధ్వర్యంలో తెరకెక్కుతోన్న 'ఎల్లమ్మ' సినిమా షూటింగ్ గండికోట పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. హీరోగా నటిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు వేణు, దేవిశ్రీలతో కలిసి ఫోటోలు దిగారు. కాగా.. గండికోటలో సినిమా షూటింగ్ జరగడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.