అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడులతో ఉద్రిక్తత నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి వైసీపీ శ్రేణులు, జూనియర్ కళాశాల మైదానం నుంచి టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో ఉద్రిక్తత


