హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణం తీసిన ఉల్లిపాయలు!

NLR: ఉల్లిపాయలు ఓ వృద్ధుడి ప్రాణం తీసిన ఘటన పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో జరిగింది. బి.చెర్లోపల్లికి చెందిన నాగేళ్ల ప్రభాకర్ నాయుడు (60) స్కూటీపై గొట్లపాలెం వైపు బయల్దేరారు. రోడ్డుపై చిందరవందరగా పడిపోయిన ఉల్లిపాయల మీదుగా వెళ్తున్న స్కూటీ అదుపు తప్పడంతో అతడు కిందపడ్డాడు. అదే సమయంలో పక్కన నుంచి వెళ్తున్న బస్సు చక్రాల కింద పడి చనిపోయాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.