వెలింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. భారత బ్యాటర్లు కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఆట ముగిసే సమయానికి భారత్ 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (52), దేవదత్ పడిక్కల్ (16) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (85) రాణించాడు. భారత్ ఇంకా 209 పరుగులు వెనుకంజలో ఉంది.
క్రీడలు
ముగిసిన రెండో రోజు ఆట


