హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్‌ విషయంలో ఇది ట్రైలర్ మాత్రమే: అశ్విన్

భారత పేసర్ సిరాజ్‌ను కివీస్‌తో తొలి టెస్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీక్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. సిరాజ్‌ను జట్టు నుంచి తప్పించేందుకు నెలరోజుల ముందే రంగం సిద్ధమైందని అభిప్రాయపడ్డాడు. ఇది ట్రైలర్ మాత్రమేనని, 2027 వన్డే ప్రపంచకప్‌లోనూ అతడికికు చోటు దక్కకపోవచ్చని వ్యాఖ్యానించాడు. 2023 ప్రపంచకప్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు.