NDL: నంద్యాల జిల్లా నూతన జడ్పీ చైర్మన్గా ఎన్నికైన షేక్ బురానుద్దీన్ శుక్రవారం బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి అభినందనలతో బురానుద్దీన్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి అభినందనతో జడ్పీ ఛైర్మన్ భావోద్వేగం


