హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డయాగ్నస్టిక్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించాలని వినతి

KDP: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న డయాగ్నస్టిక్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు డిమాండ్ చేశారు. వైద్య పరీక్షలకు అధిక ఫీజులు వసూలు చేస్తూ రసీదులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ యుగంధర్‌కు వినతిపత్రం అందజేశారు. నిబంధనలు పాటించని డయాగ్నస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.