హైదరాబాద్: 28°C
తెలంగాణ

చుక్కా రామయ్యకు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన చుక్కా రామయ్యకు CM రేవంత్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యా బోధనలో తనదైన శైలితో యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, విద్యా రంగానికి మార్గదర్శకంగా నిలిచాని పేర్కొన్నారు. ఈయన శతవసంతాలు పూర్తి చేసుకుని మరో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయురారోగ్యాలతో, ఆనందంగా గడపాలని సీఎం ఆకాంక్షించారు.