హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభకు వెళ్లి వస్తుండగా మహిళ దుర్మరణం

MDK: సిద్దిపేటలో జరిగిన CM సభకు హాజరై తిరిగి వెళ్తుండగా బస్సులో నుంచి జారిపడి హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యురాలు సారవ్వ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సాయంతో పాటు, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.