MBNR: జడ్చర్ల పట్టణంలోని కేపీ స్ట్రీట్ సాయి దర్బార్ సమీపంలో కాలువలు నిండి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే కాలువలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కాలువల దుస్థితి.. పట్టించుకోని అధికారులు!


