హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెంపటిలో యువకుడి దారుణ హత్య

SRPT: తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో శుక్రవారం ఉదయం వేళలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. వెంపటికి చెందిన చామకూరి మహేష్ (25) పొలాన్ని దున్నేందుకు తన సొంత పొలం వద్దకు వెళ్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వచ్చి కత్తితో పొడిచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.