హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో నోములు నోచుకున్న భక్తులు

CTR: ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం మహిళా భక్తులు నోములు నోచుకొనేందుకు పుంగనూరులోని శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తారు. కేదారేశ్వరస్వామి, అమ్మవార్లకు అర్చకులు శివ ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను అలంకరించి కేదారేశ్వర వ్రతం చేపట్టారు.