ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కునుసోతు తండాలో జాతీయ పక్షి నెమలి రెండేళ్లుగా స్థానికులతో మమేకమై జీవిస్తోంది. రాత్రివేళ చెట్లపై నిద్రిస్తూ, ఉదయం కోళ్ల మందలో కలిసిపోయి వాటితోపాటు మేత తింటోంది. తొలుత ఆశ్చర్యపోయిన తండావాసులు ఇప్పుడు నెమలిని ఇంటి బిడ్డలా చూసుకుంటున్నారు. శుక్రవారం మాజీ సర్పంచ్ కునుసోతు సరిత సజ్జన్ ఇంటి ఎదుట కోళ్లతో కలిసి మేత మేస్తూ కనిపించింది.
తెలంగాణ
తండావాసులతో మమేకమైన జాతీయ పక్షి


