హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ ఏజీపీఏతో భూకబ్జా.. వ్యక్తి అరెస్ట్!

RR: చేవెళ్ల మండలం పామెన శివారులోని 135, 138 సర్వే నంబర్లలో ఉన్న 15 ఎకరాల 7 గుంటల భూమిని కాజేసేందుకు నకిలీ ఏజీపీఏ సృష్టించి, అసలు వారసులు కాని వారిని చూపినట్లు పోలీసులు గుర్తించారు. ఓటరు కార్డు వివరాలకు, పత్రాల్లోని పేర్లకు పొంతన లేకపోవడంతో మోసం బయటపడింది. చేవెళ్లకు చెందిన తేకులపల్లి శ్రీనివాస్ అలియాస్ గుట్టి శ్రీను (41)ను గురువారం అరెస్టు చేసినట్లు చేవెళ్ల పోలీసులు తెలిపారు.