SRCL: ఎల్లారెడ్డి మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఇవాళ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని బయటకు తీసుకువచ్చి పడవేసి వెళ్లారు. ఈ ఘటనను గుర్తించిన గ్రామస్తులు సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణ
రాచర్ల గొల్లపల్లి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో చోరీ!


