హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవేపై బోల్తా పడ్డ యాపిల్ లారీ

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో శుక్రవారం ఉదయం యాపిల్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై యాపిల్ పండ్లు చెల్లాచెదురుగా పడటంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీని తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.