హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన రామకుప్పం విద్యార్థులు

CTR: రామకుప్పం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యార్థులు రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సత్తా చాటారు. విజయవాడలో జరిగిన సబ్ జూనియర్స్ జూడో ఛాంపియన్షిప్‌లో చిత్తూరు జిల్లా ఓవరాల్‌గా ద్వితీయ స్థానం సాధించింది. రామకుప్పం గురుకులానికి చెందిన పి.మోహన్ కృష్ణ బంగారు పతకం సాధించి, డిసెంబర్ 12 నుంచి లక్నోలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.