హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకుదెరువు కోసం వలసలు..!

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ ప్రాంత గిరిజన తండాల ప్రజలు బతుకుదెరువు కోసం వలస పయనమయ్యారు. స్థానికంగా వ్యవసాయ పనులు, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలు తండాల గిరిజనులు తమ కుటుంబాలతో పాటు, సామగ్రిని ఎడ్లబండ్లపై వేసుకొని చెరకు నరికే పనుల కోసం మనూర్, జహీరాబాద్ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఏటా ఇదే తరహాలో ఉపాధి కోసం పొరుగు ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.