BHPL: ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్న మైనారిటీ నిరుద్యోగులకు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ శుభవార్త అందించింది. గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు భూపాలపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కుమారస్వామి అసోడ తెలిపారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ


