ఖమ్మం జిల్లాలోని మూడు మండలాల తహసీల్దార్లను డిప్యూటేషన్ పై ఇతర ప్రాంతాలకు కేటాయిస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగొండలో విధులు నిర్వర్తిస్తున్న ఎం.ఉషా శారదను ఎర్రుపాలెంకు, ఎర్రుపాలెం తహసీల్దార్ సునీత ఎలిజబెత్‌ను వేంసూరుకు, వేంసూరు తహసీల్దార్ జె.మాణిక్ రావును ఖమ్మం ఆర్డీవో కార్యాలయానికి డిప్యూటేషన్ పై కేటాయించారు.
తెలంగాణ
జిల్లాలో ముగ్గురు తహసీల్దార్ల బదిలీ


