హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాబా హోటల్ కూల్చివేతలు ప్రారంభం

HYD: సికింద్రాబాద్ తిరుమలగిరి చౌరస్తా వద్ద సాబా హోటల్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు కూల్చివేతలను ముమ్మరం చేశారు. ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపార సంస్థలను ఖాళీ చేయించడంతో వ్యాపారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూల్చివేతల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ముందస్తు ట్రాఫిక్ ఏర్పాట్లు చేయలేదని విమర్శలు వస్తున్నాయి.