హైదరాబాద్: 28°C
వార్తలు

యాదగిరిగుట్టలో కార్తీకోత్సవం ప్రారంభం

TG: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 3 రోజుల కార్తీకోత్సవం ఇవాళ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు వేద మంత్రాలతో కోటి పుష్పార్చన. రేపు ఆర్‌పీ పట్నాయక్ సంగీత కచేరీ, ఈనెల 22న తెలంగాణ ఆలయాల వారసత్వంపై శాస్త్రీయ నృత్యం ఉంటాయి. ఏర్పాట్లను ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం చూస్తున్నారు. వారాంతంలో వెళ్లాలనుకునేవారు ప్లాన్ చేసుకోండి.