హైదరాబాద్: 28°C
వార్తలు

TTD అన్నప్రసాద ట్రస్టు విరాళాలు రూ.3,100 కోట్లు

AP: TTDకి వచ్చే విరాళాల్లో 50% పైగా అన్నప్రసాదం ట్రస్టుకే వస్తున్నాయని అదనపు EO వెంకయ్య చౌదరి తెలిపారు. గత రెండేళ్లలో అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1100 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. వీటితో కలిపి ప్రస్తుతం ట్రస్టు నిధులు సుమారు రూ.3,100 కోట్లకు చేరుకున్నాయని చెప్పారు. తిరుమలలో సాధారణ రోజుల్లో 3 లక్షలకు పైగా, బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు 4.50 లక్షల మందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది.