హైదరాబాద్: 28°C
తెలంగాణ

సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం పరామర్శ

KNR: సిద్దిపేట సభ అనంతరం బస్సు కోసం వెళ్తూ ప్రమాదంలో మృతి చెందిన నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పరామర్శించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి కలెక్టర్ హైమవతితో కలిసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కు అందజేశారు.