హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇది నేర్చుకుంటే అమ్మాయిలు సేఫ్!

VKB: దోమ మండలం ZPHS బొంపల్లి పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం బాలికలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగా అందిస్తున్న కరాటే శిక్షణతో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆపదలో తమను తాము రక్షించుకునే నైపుణ్యాలు అలవడతాయని ట్రైనర్స్ చెబుతున్నారు.