హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు

RR: ఆరుట్ల నుంచి బండలేమూర్ వరకు నూతన రహదారి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు బండలేమూర్ మాజీ సర్పంచి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాతులోతు శ్రీనివాస్ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ రహదారి నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.