హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడ మేయర్ పీఠం.. గెలుపు కోసం 10మంది నియామకం

కాకినాడ మేయర్ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. ఈ క్రమంలో 10 మంది సమన్వయకర్తలను అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. మంత్రి కందుల దుర్గేశ్, MLAలు కొణతాల రామకృష్ణ, బత్తుల బలరామకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్ సహా మరో ఐదుగురు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరు ప్రచారాన్ని సమన్వయం చేసుకొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ తెలిపింది.