హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికురాలిపై దాడి ఘటనపై కలెక్టర్ స్పందన

NLG: పట్టణంలోని 45వ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిపై గురువారం దాడి ఘటనను కలెక్టర్ బి. చంద్రశేఖర్ తీవ్రంగా పరిగణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కార్మికులపై దాడులు బాధాకరమని పేర్కొన్నారు.