నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొత్తగా నియమితులైన మేడారం అపర్ణ ప్రదీప్ గురువారం నిర్మల్ పట్టణంలో నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరి రావు, మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేశ్‌ను కలిశారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
తెలంగాణ
నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అపర్ణ ప్రదీప్


