హైదరాబాద్: 28°C
తెలంగాణ

మామ పోతే అల్లుడు.. అల్లుడు పోతే బామ్మర్ది.. సీఎం సెటైర్లు!

SDPT: సిద్దిపేటలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్బంగా ఛత్రపతి సినిమాలోని డైలాగ్‌ను గుర్తుచేశారు. 'మామ పోతే అల్లుడు, అల్లుడు పోతే బామ్మర్ధి, వాడుపోతే వీడు.. వీడు పోతే వాడు' అంటూ విరుచుకుపడ్డారు. సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.